వచ్చే మూడ్రోజుల్లో వర్షాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ భారతదేశంలోని మరి కొన్ని భాగాలకు విస్తరిస్తాయనీ, దిగువ స్థాయి గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని (ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌,హన్మకొండ, వరంగల్‌ మరియు జనగాం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపారు.