
పట్టణ శివారులోని గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఎందు శనివారం విద్యార్థులకు రేన్ డే సంబరాలు ఘనంగా జరిపారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చిన్నారులు రంగురంగుల గొడుగులు తెచ్చుకొని వర్షానికి తడవకుండా ఉండే దుస్తులు వేసుకొని వర్షంలో కేరింతల కొడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటూ వర్షాకాలపు అద్భుతాలని ఆస్వాదించారు. ఉపాధ్యాయులు పిల్లలకు ప్రయోగాత్మకంగా పిల్లలు వర్షాకాలంలో సరైన దుస్తులు ధరించి అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఇంటి వాతావరణన్ని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల విష జ్వరాలకు లోను కాకుండా ఉంటామని వారు పిల్లలకు సూచించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.