సదర్‌మాట్‌లో పెరిగిన నీటి మట్టం

నవతెలంగాణ-ఖానాపూర్‌టౌన్‌
ఖానాపూర్‌, కడెం మండలాల రైతులకు సాగునీటి ఆధారమైన సదర్‌మాట్‌ అనకట్టలో నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం అనకట్టలో 8 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు సదర్‌మాట్‌ ఎగువన ఉన్న వాగులు, ఒర్రెల నుంచి వచ్చే జలదారలతో గోదావరి నదిలో కొంత నీటి ప్రవాహం పెరిగింది. దీంతో మొన్నటి వరకు అడుగంటి కనిపించిన సదర్‌మాట్‌లో ఇప్పుడు కట్టపై నుంచి నీరు ప్రవహిస్తుంది. ఒకటి, రెండు వర్షాలు పడితే నీరు విడుదల చేసే స్తాయిలో వరద పెరిగే అవకాశం ఉంది. గడిచిన ఖరీఫ్‌లో కెనాల్‌ గండ్ల మరమ్మతు పనులు అధికారులు సకాలంలో పూర్తిచేయని కారణంగా నీటి విడుదలలో జాప్యం జరిగి రైతులు ఇబ్భంది పడ్డారు. ఈసారి కెనాల్‌ మరమ్మతుల సమస్య లేనందున ఆయకట్టుకు సమయానికి నీరు విడదల చేస్తారన్న ఆశతో రైతులున్నారు.