పిల్లల ఆరోగ్యంపై అవగాహన పెంపు

పిల్లల ఆరోగ్యంపై అవగాహన పెంపు–  ఫ్యూచర్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌, కంట్రీ డిలైట్‌ జట్టు
హైదరాబాద్‌ : పిల్లల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, ఫ్యూచర్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌, కంట్రీ డిలైట్‌ జట్టు కట్టాయి. రెండు సంస్థలు కలిసి రూపొందిస్తున్న క్యాంపెయిన్‌లో పాఠశాలకు వెళ్లే పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన పోషకాహారం, వ్యాయామం, విశ్రాంతి అంశాలపై అవగాహన పెంచనున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో ఇరు సంస్థలు కలిసి నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ చర్చ, సమావేశంలో 20 మందికి పైగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు 8-5-1-0 ఆరోగ్య నియమావళిని సిఫార్సు చేశాయి. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని, రూల్‌ ఆఫ్‌ 5లో సమతుల్య ఆహారం, ఒక గంట వ్యాయామం, నియమం ‘0’ ఎలాంటి అనారోగ్యకరమైన ఆహారాలను తినకూడదని, ఆహరం వృధా చేయటాన్ని సహించరాదని, మొబైల్‌, టివి చూసే సమయాన్ని తగ్గించుకోవాలని ఫుడ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ సిఇఒ పవన్‌ అగర్వాల్‌, కంట్రీ డిలైట్‌ సహ వ్యవస్థాపకుడు చక్రధర్‌ తదితరులు సూచించారు.