నవతెలంగాణ – పెద్దవూర
ప్రభుత్వం అందిస్తున్న 4 సంక్షేమ పథకాలు నిజ మైన లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలం లోని బసిరెడ్డి పల్లి గ్రామం లో గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందించనున్న నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథ కాలు ప్రతి పేదవాడి గడపకు అందేలా చూడాలని కోరారు. ఎంపిక ప్రక్రియలో రాజ కీయ నాయకులఒత్తిళ్లకు తలఒగ్గకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియజర గాలని ఆదేశించారు. రాజకీయాలు కుల, మతాలకతీతంగా ప్రతి నిరుపేదకు పధకం ద్వారా లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధీర్ కుమార్ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డీ పంకజ్ రెడ్డీ, సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.