– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంజిత్ రెడ్డి, ప్రశాంత్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )కి గుగులోతూ రాజు నాయక్ కు ఎలాంటి సంబంధం లేదని హుస్నాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యలు దృష్టిలో ఉంచుకోవాలని ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఆముదలా రంజిత్ రెడ్డి దాసరి ప్రశాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొద్ది రోజులుగా ఎస్ఎఫ్ఐ పేరుతో చలామణి అవుతూ విద్యాసంస్థలాను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని సమాచారం ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రం లో ఎస్ ఎఫ్ ఐ కి గుగులోత్ రాజు నాయక్ కు సంఘం తో ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యలు గుర్తుంచుకోవలని సంఘం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. సంఘం వైపు నుండి కూడా కేసులు పెడతామని అన్నారు. ప్రైయివేటు విద్యాసంస్థలు సంఘం పేరుతో వస్తే కేసులు పెట్టాలన్నారు.