మెప్పించే ‘రాజా మార్కండేయ’

శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్‌, ఫోర్‌ ఫౌండర్స్‌ పతాకాలపై బన్నీ అశ్వంత్‌ దర్శకత్వంలో సామా శ్రీధర్‌, పంజాల వెంకట్‌ గౌడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజా మార్కండేయ’. వేట మొదలైంది అనేది ఉప శీర్షిక. యస్‌కె మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు, సత్యదీప్‌ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సుమన్‌, ప్రతాని రామకష్ణ గౌడ్‌, హీరో తేజస్‌ వీరమాచినేని, హీరోయిన్స్‌ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ ఆశ్వంత్‌, నిర్మాతలు సామా శ్రీధర్‌, పంజల వెంకట్‌ గౌడ్‌, సహ నిర్మాతలు గౌరిశెట్టి శ్రీనివాస్‌, మాజీ టూరిజం ఛైర్మెన్‌ శ్రీనివాస్‌ గుప్తా, హైకోర్ట్‌ అడ్వకేట్‌ రాపోలు భాస్కర్‌, హాస్యబ్రహ్మ శంకర్‌ నారాయణ, సామాజికవేత్త – ప్రొడ్యూసర్‌ డాక్టర్‌ మూసా అలీ ఖాన్‌, కటకం శ్రీనివాస్‌ గుప్తా, ఇన్స్టాఫేమ్‌ కవిరాజ్‌ దంపతులు, సామాజికవేత్త గంగాపురం పద్మా గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిధులు చిత్రంలోని ఒక్కో పాటను ఆవిష్కరించగా, టీజర్‌ను రాపోలు భాస్కర్‌ విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను హీరో సుమన్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బన్నీ ఆశ్వంత్‌ మాట్లాడుతూ,’ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి?, వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది కాన్సెప్ట్‌. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు’ అని అన్నారు. ‘మా బన్నీ ఆశ్వంత్‌ వల్లే ఈ సినిమాని నిర్మించగలిగాం. కథని నమ్మి తీసిన సినిమా ఇది. సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్‌కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాతల్లో ఒకరైన సామా శ్రీధర్‌ చెప్పారు.