కమ్మర్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రాజ శ్రీనివాస్ బుధవారం వీధులల్లో చేరారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ ఎంపీడీవో గా కొనసాగిన ఆయన బదిలీల్లో భాగంగా కమ్మర్ పల్లి ఎంపీడీవో గా వచ్చారు. ఇప్పటివరకు ఎంపీడీవో గా కొనసాగిన సంతోష్ రెడ్డి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బదిలీపై వెళ్లారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన రాజ శ్రీనివాస్ పేర్కొన్నారు. నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన రాజా శ్రీనివాస్ కు మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్ మైలారం గంగాధర్, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.