ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి

 – పార్టీ మారుతున్నారని అనడంలో నిజం లేదు,
– తప్పుడు ప్రచారం చేయడం తగదు- కుంభం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ – నాంపల్లి
: ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం నాంపల్లి మండల కేంద్రంలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. తను బీఆర్ఎస్ ని వీడే ఆలోచన తనకు లేదని రాజగోపాల్ రెడ్డి మాటలను ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖండించారు. నాంపల్లి పట్టణంతో పాటు మండలంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రావడం ఖాయం అని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, అయోమయానికి గురి కావద్దని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అయోమయానికి గురి చేయడానికి మాత్రమే రాజగోపాల్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది నక్క రవీందర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నక్క చంద్రశేఖర్, జిల్లా నాయకులు ఇట్టం వెంకటరెడ్డి, ఏడుదొడ్ల, ప్రభాకర్ రెడ్డి, నాంపల్లి పట్టణ అధ్యక్షులు నాంపల్లి సత్తయ్య, కర్నే.యాదయ్య, రాగి ఫణి శ్రవణ్ కుమార్, కామిశెట్టి యాదయ్య, గుండెబోయిన సత్తయ్య, పంగ కొండయ్య, ఎదుల్ల యాదగిరి, గాదేపాక వెలాద్రి, కర్నాటి మహాత్మ, దోటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.