పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ

– తాజా పరిణామాలపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో మార్పులు, చేర్పుల నేపథ్యంలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌ లోని పొంగులేటి నివాసంలో ఆయన్ను రాజగోపాల్‌రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. తాజారాజకీయ పరిణా మాలపై చర్చించారు. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో రాజగోపాల్‌ రెడ్డి సంప్రదింపులు జరిపారని సమాచారం. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డిని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో రాజగోపాల్‌ సొంతగూటికి చేరబోతున్నారా? అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కమలం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.