నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహాగౌడ్ కోరారు. శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని ఆ పార్టీ క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలోని 11 వార్డుల అధ్యక్షులు, కార్యవర్గం, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్‌తోనే మునుగోడు అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ సైదులుగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేశ్‌గౌడ్, మున్సిపాలిటీ ప్రధానకార్యదర్శి పందుల రాజేశ్‌గౌడ్, కల్లెం దయాకర్‌రెడ్డి, పల్చం శ్రీను, బండమీది వెంకటేశ్, యూసుఫ్, పెద్దగోని రమేశ్‌గౌడ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, చింతల సాయిలు, బొబ్బిళ్ల మురళి, పాలడుగు వెంకన్న, అబ్బాస్ బేగం, రాంబాబు, శివ పాల్గొన్నారు.