
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మునుగోడు మండలంలోని చీకటి మామిడి గ్రామంలోని రామాలయం వద్ద గ్రామస్తులు హోమం నిర్వహించగా డీసీసీబీ డైరెక్టర్ , మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాలుగా నియంత పాలనను అంతం చేసేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధితోపాటు రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందినందుకు రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పించాలని అధిష్టానంకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంత వీర స్వామి గౌడ్ , మాజీ సర్పంచులు తాటికొండ సంతోష సైదులు , పాలకూరి యాదయ్య , పిఎసిఎస్ డైరెక్టర్ మేకల మల్లయ్య , ధర్మయ్య , నరసింహ , స్వామి, గణేషు, నగేష్ , ముస్తఫా తదితరులు ఉన్నారు.