కేసీఆర్‌ తో రాజయ్య భేటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యకు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ బాధ్యతలు మొత్తం పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ గెలిపించుకోవాలని సూచించారు.