బీఆర్ఎస్ కు రజకుల మద్దతు..

నవతెలంగాణ- డిచ్ పల్లి: రజకుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విశేష కృషి చేశారని, రాష్ట్రం లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రజకులు అన్నారు. సోమవారం ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామంలో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి దాస్ లు అధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. రజకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడ లేవని వారన్నారు. గ్రామంలో రజకులను స్పూర్తి గా తీసుకుని ఇతర కుల సంఘాల నాయకులు సైతం సంపూర్ణ మద్దతు అందజేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, సాకలి నారాయణ సాకలి రాములు సాకలి వివేక్, సాకలి గంగాధర్, గడ్కోల్ శ్రీనివాస్, బాదావత్ రాజు నాయక్, అరటి రఘు, సంజీవరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పిండి గంగాధర్, ఎంపీటీసీ లావణ్య, రవి, రాకేష్, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.