జీఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాజమౌళి 

నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని పెద్దకొడపాక మత్స్య సొసైటీ చైర్మన్ గండి రాజమౌళి బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మత్స్య సొసైటీ ఉపాధ్యక్షులు ఐరబోయిన రాజు, డైరెక్టర్లు కుక్కల తిరుపతి, పల్లెబోయిన సురేష్, ఐరబోయిన తిరుపతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, కొప్పుల, జోగంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఏరుకొండ శంకర్, మారబోయిన ప్రభాకర్ మత్స్య సొసైటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని చైర్మన్ కు తెలపడంతో బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్ గండి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి మోరే నరేష్, డైరెక్టర్ కుక్కల ఆనంద్ లు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మత్స్య సొసైటీ అభివృద్ధికి తన వంతు సహకారం ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్య సొసైటీ పాలకవర్గం ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.