ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఉండాలన్నదే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్యం అని కాంగ్రెస్ జిల్లా నాయకులు , మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అన్నారు . బుధవారం మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన గుండెబోయిన శ్రీరాములు గత కొన్ని నెలల క్రితం అనారోగ్యానికి గురికాగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే ప్రత్యేక క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి అందజేశారు . ఈ సందర్భంగా వేమిరెడ్డి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సమాన న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు . హామీల అమలుకు నిదర్శనం రైతుల రుణమాఫీనేనని అన్నారు.ఈ కార్యక్రమంలో కొంక శంకర్ , కొంక చంద్రయ్య , పగిల్ల శ్రీరాములు , గౌరీశంకర్ , స్వామి , పరమేష్ , జి రాజు , జి మల్లేష్ తదితరులు ఉన్నారు.