
తెలంగాణ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాజర్షి సాహో మహారాజ్ జయంతిని పురస్కరించుకొని రిజర్వేషన్ డే జరుపుకున్నారు. బ్రిటిష్ కాలంలోనే కొల్లాపూర్ సామ్రాజ్యాన్ని అధిపతిగా వ్యవహరించి సమన్యాయం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అన్ని వర్గాల అభివృద్ధి, ఉచిత నిర్బంధ విద్య, బడుగు బలహీన వర్గాలకు 50% పైగా రిజర్వేషన్లు అమలు పరిచి బడుగు బలహీన వర్గాలకు ఆశ జ్యోతిగా నిలిచారని లక్ష్మీ నారాయణ కోనియడారు. ఇప్పటి ప్రభుత్వాలు, పార్టీలు నాయకులు సమసమాజ అభివృద్ధి కోసం సహో మహారాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్య,సాయిబాబా, సాయి పవన్, మల్లేష్, శ్రీనివాస్, రాఘవేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.