రాజస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత

నవతెలంగాణ – రాజస్థాన్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి మరణించారు. కరాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న గుర్మీత్‌సింగ్ కూనెర్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స  పొందుతూ మృతి చెందినట్టు బుధవారం పార్టీ నేతలు తెలిపారు. 75 ఏళ్ల కూనెర్ కరాన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ నెల 12న ఆయన ఎయిమ్స్‌లో చేరారు.  సెప్టిక్ షాక్, మూత్రపిండ వ్యాధితో గుర్మీత్ మరణించినట్టు ఆస్పత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొంది. ఆయన హైపర్‌టెన్షన్‌తోనూ బాధపడుతున్నారు. గుర్మీత్ మృతికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి.