మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రాజేందర్ రెడ్డి 

నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా సోమవారం రాజేందర్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఈయన వరంగల్లో అడిషనల్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. కామారెడ్డిలో కమిషనర్ గా పనిచేసిన స్పందన సంగారెడ్డి మెప్మా లో ఈఒగా విధులు నిర్వహించి ఇక్కడికి వచ్చారు, తిరిగి అదే స్థానానికి తిరిగి వెళ్లారు. స్పందన కామారెడ్డిలో మున్సిపల్ కమిషనర్ గా రెండు నెలలు కూడా పూర్తిగా విధులు నిర్వహించలేకపోయారు.