ఇంటర్ పూర్తికాగానే ఉపాధి అవకాశాలు పొందే అవకాశం: రాజేష్ రెడ్డి 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్ పూర్తి కాగానే వివిధ ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందని ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి శుక్రవారం అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఆదర్శ  కళాశాలలో చేరి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కళాశాలలో ఇంటర్ లో చేరే విద్యార్థుల కోసం ప్రత్యేక  శ్రద్ధ వహించి సీనియర్ ఉపాధ్యాయుల తో ఉత్తమ బోధనను అందిస్తున్నట్లు  తెలిపారు. ఇందుకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ కోర్సులలొ చేరిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐఐటీ, జేఈఈ, నీట్ , టీయస్ -ఈఏపిసెట్, ల తో పాటు సాంకేతీక పరిజ్ఞానం కోసం టాలీ, అకౌంటింగ్, ఎమ్మెస్-ఆఫీస్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల పై ప్రత్యేక సమయం కేటాయించి బోధన చేయడం జరుగుతుందని తెలిపారు.
అలాగే కళాశాలలో చేరిన విదార్థులు ఒకేషనల్ ఎడ్యుకేషన్ లో భాగంగా Apparel madeups (assistant fashion designer) మరియు IT & ITES (data entry operator-texturing ) ఎదో ఒక కోర్సులలో చేరి ఇంటర్ పూర్తి కాగానే వివిధ ఉపాధి అవకాశాలను పొందే అవకాశం కలదు. అలాగే విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలో కల  విశాల క్రీడా మైదానంలో హ్యాండ్ బాల్, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, షటిల్ -బాడ్మింటన్ వంటి ఆటలలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడి ద్వారా తర్పీదు ఇవ్వబడును, కావున ఆసక్తి కల విద్యార్థులు ఈ నెల 25 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థులు వారి మొబైల్ ఫోన్ నుండి లేదా దగ్గరలో కల మీసేవ ద్వారా www.tsmodelschools.in అనే లింక్ ద్వారా ఎటువంటి రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, పూర్తి వివరాల కొరకు 9490771237 నంబర్ను సంప్రదించాల్సిందిగా ఆయన తెలిపారు.