నవతెలంగాణ-జన్నారం
మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో ఆదివారం సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు కొండగూర్ల లింగన్న, కూకటికారి బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అనంతరం గ్రామ కమిటీ కార్యదర్శిగా బండారి రజితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.