
హుస్నాబాద్ పట్టణాన్ని పచ్చదనంతో స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే వనమహోత్సవం నిర్వహించారు. ఏడవ వార్డులోని డిపో వెనుక కాలనీలో, 1 వ వార్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతిరోజు రెండుసార్లు మొక్కలకు నీళ్లు పోయాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల ఉష్ణోగ్రత, కాలుష్యం తగ్గుతుందన్నారు. కాలుష్యం తగ్గడం వల్ల పర్యావరణం మెరుగుపడుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధులు డయేరియా, మలేరియా, టైఫాయిడ్ రాకుండా ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని సూచించారు.ఎప్పటికప్పుడు రోడ్లకు ఇరువైపు లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవాలని దానికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ , వైస్ చైర్పర్సన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు నళిని దేవి,బొజు రమా దేవి , స్వర్ణలత , భాగ్య రెడ్డి, లావణ్య , పద్మ , వేణు, ఎం.శ్రీనివాస్, రవి , దొడ్డి శ్రీనివాస్ ,గుళ్ళ రాజు , కల్పన , సరోజన , రత్నమాల, వల్లపు రాజు, రమేష్ , హరీష్ , సుప్రజ , కో ఆప్షన్ మెంబెర్స్ శంకర్ రెడ్డి , అయుబ్, శ్రీలత , లలితగారు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.