– కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ – ములుగు
దేశానికే దిశా నిర్ధేశం చూపిన మహానీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. నవ భారత నిర్మాత నవ యువతకు స్ఫూర్తి ప్రదాత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ సమసమాజ స్థాపన కోసం చేసిన కృసి మరువలేనిదని అన్నారు. ప్రపం చంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకులనేలా చేసింది రాజీవ్ గాంధీనే అని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కషి చేశారని, ఐటీ రంగంలో నేడు ఇండియా అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ గాంధీ కృషి ఫలితమే అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుంటోజు శంకరయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి మధు,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కష్ణ,మాజీ ఉప సర్పంచ్ ఏళ్లవుల అశోక్, ఓరు గంటి అనీల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.