
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విప్లవత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనుడు రాజీవ్ గాంధీ అని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు మండల అధ్యక్షుడు అక్కపల్లి బాల్ నర్సాగౌడ్ అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు మండల అధ్యక్షుడు అక్కపల్లి బాల్ నర్సాగౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారత దేశాన్ని ఐటీ, టెలికాం మరియు అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలో నేడు భారత దేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు పునాదులు వేసిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అని కొనియాడారు.టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ గారు అని తెలిపారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది తెలిపారు.బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని తెలిపారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత పిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ గారు చరిత్ర సృష్టించారని తెలియజేశారు.పేదల సంక్షేమం కోసం మరియు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపడానికి తన చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడని ఈ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి ఎంపిటిసి అబ్బుల ఉమారాణి బాలా గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, మహిళ మండల అధ్యక్షురాలు కూతురి సుమలత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూంపల్లి భీమ్రావు, బాల్తే వెంకటేశం,ఎల్లన్న గారి మధుసూదన్ రెడ్డి, షేర్ పల్లి స్వామి అక్బర్ పేట గ్రామ అధ్యక్షుడు కూతురి చందు, భూంపల్లి గ్రామ అధ్యక్షుడు ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, బేగంపేట గ్రామ అధ్యక్షుడు ఉద్ధమారి సతీష్, నిఖిల్, నగరం కిషన్, అన్న బోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.