యువత స్ఫూర్తి కోసమే రాజీవ్ గాంధీ క్వీజ్ పోటీలు

– కరపత్రాలను అవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – బెజ్జంకి
రాబోయే రోజుల్లో పోటీ పరీక్షల వైపు దృష్టి మరల్చి యువతలో స్ఫూర్తి నింపడానికి రాజీవ్ గాంధీ క్వీజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు కరీంనగర్ డీసీసీ కార్యదర్శి వెన్నం రాజమల్లు తెలిపారు.జూన్18న నిర్వహించే రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్వీజ్ పోటీల కరపత్రాలను సోమవారం మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో నాయకులు అవిష్కరించారు.ఆసక్తి గల18 నుండి 35 ఎండ్ల వయస్సున్న వారు జూన్ 17 వరకు 7661899899 పోన్ నంబర్ యందు సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని వెన్నం రాజమల్లు సూచించారు.ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, నాయకులు రొడ్డ మల్లేశం,రాములు,మంకాలి ప్రవీణ్, డీవీరావు తదితరులు పాల్గొన్నారు.