నవతెలంగాణ – వేములవాడ
భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార, సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. మంగళవారం ప్రభుత్వ విప్ ,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధృవతార సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా పునాదులు వేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. తన చివరి ఊపిరి ఉన్నంతవరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ విశ్రాంతి ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, గాంధీ వారసత్వాన్ని పెంచుకొని దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని తెలిపారు.. సెక్రటేట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కేటీఆర్ విగ్రహాన్ని తొలగిస్తామనడం వారి అహంకారానికి నిదర్శనం అని వారన్నారు, ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధం వెలకట్టలేనిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, పులి రాంబాబు గౌడ్, తూమ్ మధు, దుర్గం పరశురాం, తోట రాజు, సయ్యద్ సాబీర్, నాగుల మహేష్, ముప్పిడి శ్రీధర్, కొలకాని రాజు, వాస్తాద కృష్ణ ప్రసాద్ గౌడ్, కొక్కుల బాలకృష్ణ, కుతాడి రాజేశం, అక్కన పెళ్లి నరేష్, షాహిద్, సాబీర్, దూలం భూమేష్, తిరుపతి, ఖమ్మం గణేష్, సాయిని అంజయ్య, తదితరులు ఉన్నారు.