నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకలను భువనగిరిలో కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రిన్స్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి కంప్యూటర్ను పరిచయం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎసి డిపార్ట్ మెంట్ కన్వీనర్ పులిగిల్లా బాలయ్య,కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు చుక్క స్వామి,గుమ్మడేళ్లి రమేష్,మండల కార్యదర్శి బొల్లెపల్లి అశోక్,మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్,మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు శానుర్ బాబా,బీసీ సెల్ మండల అధ్యక్షులు మచ్చ నరసింహ గౌడ్,గ్రామశాక అధ్యక్షులు. ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్,చిన్నం శ్రీనివాస్,పిట్టల వెంకటేష్,వెంకటేష్ ఉడుత కార్తీక్ లు పాల్గొన్నారు.