
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, కోఆర్డినేటర్ కమిటీ ప్రెసిడెంట్ విఠల్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామచందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి ,మండల మైనార్టీ ప్రెసిడెంట్ ఇమామ్ ,మండల యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్, సురేందర్ గౌడ్, సంజీవులు, భాషు మియా, గణేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.