– మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
భారత దేశ మాజీ ప్రధాని,భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం బాన్సువాడ పట్టణంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ స్పీకర్,మాజీ మంత్రి,బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రొస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు పాల్గొన్న ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.