రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

నవతెలంగాణ-మిర్యాలగూడ
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతిని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, పీసీసీ మెంబర్‌ చిర్రుమర్రి కృష్ణయ్యలు రాజీవ్‌ గాంధీ విగ్రహానికి, అంత క ముందు రాజీవ్‌ భవన్‌ రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజీవ్‌ గాంధీ చేసిన అభివృద్ధి సేవలను కొనియడారు. ఈ కార్యక్రమంలో రామలింగయ్య, గాయం ఉపేందర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్‌, తమ్మడపైన అర్జున్‌, జిల్లా కాంగ్రెస్‌ జంగల్‌ సెక్రెటరీ చిలుకూరి బాలు, ఉపాధ్యక్షులు నాగు నాయక్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు జలంధర్‌రెడ్డి, కొమ్మన నాగలక్ష్మి, గంధం రామకృష్ణ, పొదిలి వెంకన్న, గుంజా శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సలీం, ఆరిఫ్‌, సోమయ్య, బసవయ్యగౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌, పాతూరు ప్రసాద్‌, గౌస్‌, రవీందర్‌రెడ్డి, చాంద్‌ పాషా, వెంకటకష్ణ, నాగిరెడ్డి, అవుట శ్రీను, అబ్దుల్లా, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్‌ : భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బీరోలు ఉపేందర్‌రెడ్డి, ఎండి.యూసుఫ్‌, చెనగోని రాజశేఖర్‌గౌడ్‌ వంటపాక సతీష్‌, నర్సింగ్‌ మహేష్‌గౌడ్‌, పందిరి సతీష్‌ పాల్గొన్నారు.
కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో…
రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకొని టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రులోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌, నాయకులు లింగాల వెంకన్న, పొన్నాల రాఘవరెడ్డి, వ్యాస కరుణాకర్‌ రెడ్డి, బడుగుల చంద్రశేఖర్‌, ముక్కామల శేఖర్‌, కొండ అంజమ్మ, కందాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఆధ్వర్యంలో…
రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఆధ్వర్యంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు వేదాసు శ్రీధర్‌, నాయకులు గుణగంటి రాజు గౌడ్‌ గుండా జలంధర్‌ రెడ్డి ఏ మహేందర్‌ రెడ్డి భయ్యా ముత్తయ్య బొంబాయి శ్రీను పులిగిల్ల శంకర్‌ పాల్గొన్నారు.
కేతపల్లి : భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్థంతి సందర్భంగా కేతపల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు. దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన అజరామరుడు తన చివరి రక్తపు బొట్టు వరకు దేశానికి అంకితం చేసిన త్యాగశీలి రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, మైనార్టీ విభాగం ఏండీ.యూసుఫ్‌, జానీ, కిసాన్‌ కాంగ్రెస్‌ కోఆర్డినేటర్‌ అలుగుబెల్లి మహేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కోట పుల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు బయ్య ముత్తయ్య, గుండు గుండు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.