లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, బిజెపి సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలకు సోమవారం దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాజ్‌నాథ్‌సింగ్ నామినేషన్ దాఖలు చేసే ముందు నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. అలాగే స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఐదవ దశ పోలింగ్‌లో లక్నో స్థానానికి పోలింగ్ జరగనుంది.
2019లో కూడా లక్నో స్థానం నుంచే రాజ్‌నాథ్‌సింగ్ పోటీ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాపై 6.3 లక్షల ఓట్లతో గెలుపొందారు. సాధించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.