కాంగ్రెస్ పార్టీ బిసి మండల అధ్యక్షునిగా రాజు

నవతెలంగాణ- భీంగల్

భీంగల్ …..మండలంలోని ముచ్కూర్ గ్రామానికి చెందిన కొరాడి రాజును కాంగ్రెస్ పార్టీ బీసీ మండలాధ్యక్షు ని గా నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు బోధిరే స్వామి తెలిపారు సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన సమావేశంలో బీసీ మండల అధ్యక్షుడు కోరాడి రాజును ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుప్కల్ గ్రామానికి చెందిన పెండ్యాల బొర్రన్న ను నియమించారు ఈ మేరకు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి , పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ ల చేతుల మీదుగా అందజేశారు. ఈ నియామకానికి కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈరవత్రి అనిల్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భీంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరే స్వామి డిసిసి డెలిగేట్ కుంట రమేష్ పాల్గొన్నారు