సీజనల్ వ్యాధుల అదృశ్య విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు కస్తూర్బా గురుకుల పాఠశాలలో శనివారం ప్రిన్సిపాల్ కు సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను డీఈఓ రాజు తనిఖీ చేశారు. స్టాక్ రూమ్, వంటగది, బాత్రూం, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద అభివృద్ధిని చూసి సంతోషించారు. పాఠశాల ఆవరణ పిచ్చి మొక్కలను గ్రామపంచాయతీ సహకారంతో తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం ఈ ఓ యోసేపు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.