పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి: రాజు

Pending issues should be resolved immediately: Rajuనవతెలంగాణ – కొనరావుపేట
పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతోపాటు 4డీఏలను విడుదల చేసి, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చేశారు. గురువారం కోనరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ  కేంద్రాల్లో3వ  తరగతి విద్యాబోధన చేపడితే ప్రాథమిక పాఠశాలకు ముప్పువాటిల్లే పరిస్థితి నెలకొంటు  పీఎస్ హెచ్ఎం 10 వేల పోస్టులను మంజూరు  చేసి, కామన్ సీనియార్టి ప్రకారం పీఎస్  భర్తీ చేయాలన్నారు. తద్వార విద్యార్థులకు మరింతా నాణ్యమైనా విద్యను అందించవచ్చాన్నారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి కొక్కుల బాలరాజు, మండల ఉపాధ్యక్షులు గాలిపెల్లి సంతోష్ ఉన్నారు.