‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలతో అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల.రాజు వెడ్స్ రాంబాబు’ సినిమాతో ఆయన నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ మోపిదేవితో కలిసి డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్‌పై ఈ సినిమాని ఆయన నిర్మిస్తున్నారు. సాయిలు పాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఖమ్మం, వరంగల్ బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కింది. టైటిల్ గ్లింప్స్ లాంచ్ ప్రెస్‌మీట్‌లో నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ,’సాయిలు నాతో మూడేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ ప్రాంతంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని ఒక కథ రాశానని ప్పాడు. కథ విన్న తర్వాత నాకు ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. కథలో ఉన్న ఇన్నోసెన్స్, కథ జరిగే ప్రాంతం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ అన్ని నన్ను బాగా ఎట్రాక్ట్ శాయి. క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేనెప్పుడూ చూడలేదు, వినలేదు. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్‌తో టీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది. వాళ్లు కూడా కథ విని, హ్యాపీగా ఫీలయ్యారు. ఈ కొలాబరేషన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్‌ని రిలీజ్ శాం. ఇది మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కథ. పాత్రలన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఇద్దరం కలసి ప్రొడ్యూస్ చేసి, యేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరినీ గొప్పగా అలరిస్తుంది’ అని ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కష్ణ చెప్పారు. ఈటీవీ విన్ కంటెంట్ డ్ తిన్ మాట్లాడుతూ, ‘థియేటర్స్‌కి సత్తా ఉన్న కథని తీసుకెళ్దామని అనుకున్నాం. అందులో మేం చేస్తున్న మొదటి ప్రయత్నం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ కథ విన్నప్పుడే థియేటర్స్ నిమా అనుకున్నాం. గొప్ప థియేటర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని తెలిపారు. ‘నేను అనుకున్న కథని స్క్రీన్‌మీదకి తీసుకొచ్చేందుకు వేణు ఊడుగుల సహకారం రువలేనిది. ఈ కథ విని ఆయన నిర్మాతగా మారటం చాలా సంతోషంగా ఉంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టే సినిమా ఇది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కే సినిమాలను ప్రేక్షకులు గా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా అదే కోవలో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడిగా ఈ సినిమా నాకు, నా టీమ్‌కి మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి, రచన, దర్శకత్వం: సాయిలు కంపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్, ఎడిటింగ్: నరేష్ డుప, ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్, సౌండ్ డిజైన్: ప్రదీప్ జి, సాహిత్యం: మెట్టపల్లి సురేందర్.