రాజులకొత్తపల్లి గ్రామ సెక్టార్లో ఘనంగా పోషణ పక్షం 

– ఐసీడీఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామ సెక్టర్ పరిధిలో అంగన్వాడి టీచర్లతో కలిసి ఘనంగా పోషక పక్షం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ సెక్టర్ ల సూపర్వైజర్లు మల్లీశ్వరి ఉషారాణి నాగమణి విజయ లు తెలిపారు. మండలంలోని రాజుల కొత్తపల్లి సెక్టార్ సూపర్వైజర్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో పోషణ పక్షం లో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు అన్నప్రసన చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాజులకొత్తపల్లి సెక్టార్లో పోషణ పక్షంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు అన్నప్రాసన అక్షరాభ్యాసం మొదలైన వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా  ఫుడ్ ఎగ్జిబిషన్, ప్రీ స్కూల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిలో భాగంగా గర్భిణీలను బాలింతలను చిన్నపిల్లల తల్లులను కిశోర బాలికలను కార్యక్రమానికి ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి పోషకాహారం గురించి అందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. బాల్యారంభ దశ ప్రీస్కూల్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామని అన్నారు. అనంతరం బాల్య వివాహాలు, లింగ వివక్షత, భ్రూణ హత్యలు మొదలగున వాటిపై ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో  రాజులకొత్తపల్లి ప్రైమరి స్కూల్ హెచ్ఎం  సోమిరెడ్డి ఈ ఐసిడిఎస్ నెల్లికుదురు వావిలాల సూపర్వైజర్లు నాగమణి ఉషారాణి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి  యాకుబ్ రెడ్డి   పల్లె దావకాన డాక్టర్ సంధ్య  అంగన్వాడీ టీచర్స్   , ఆశా కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.