తెలంగాణ ఉద్యమకారుడు బి ఆర్ ఎస్ పార్టీలో సర్వస్వం కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న మిరుదొడ్డికి చెందిన బలిజ రమేష్ కుటుంబానికి సీనియర్ జర్నలిస్టు ర్యాకం నర్సింలు పుష్ప నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన బలిజ రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి రమేష్ అన్నారు రమేష్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి మరువలేనివి అని అన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ఆయనకు సహాయం చేయాలని కోరారు. అనంతరం పార్టీలకతీతంగా బలిజ రమేష్ కు వ్యక్తిగతంగా అండగా ఉంటామంటూ కాంగ్రెస్ నాయకులు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. వారు వెంట కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ కుమార్ మహేష్ భూపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.