వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ గా గర్జనపల్లి పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి, కాంగ్రెస్ నాయకులు బుచ్చగారి రాకేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, పాఠశాలలో నెలకొన్న సమస్యలను వివరించగా, గ్రామంలోని యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం పాఠశాలలో సమావేశమై, పాఠశాల అభివృద్ధి కోసం ఒక కమిటీగా ఏర్పాటు కావాలని నిర్ణయించి, నూతన కమిటీనీ ఎన్నుకున్నారు. అభివృద్ధి కమిటి చైర్మన్ గా రాకేష్ గౌడ్, కోశాధికారిగా గజ్జెల ప్రశాంత్, వైస్ చైర్మన్ కెలోత్ తిరుపతి, సభ్యులుగా రవి, ప్రశాంత్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ గర్జనపల్లి పాఠశాల పూర్వ విద్యార్థిగా, పాఠశాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.