నవతెలంగాణ-చండూరు : రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మహిళలు రాఖీల కొనుగోలులో సోమవారం బిజీ బిజీగా షాపింగ్ చేస్తూ ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని గ్రామాలలో, చండూరు లో సమీప గ్రామాల మహిళలు అధికంగా తరలి వచ్చి వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి రాఖీలను ఖరీదు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో సమీప గ్రామాల నుండి వ్యాపార కేంద్రాలకు చేరుకున్నారు. రాఖీలతోపాటు అవసరమైన తినుబండారాలను స్వీట్స్ ను ఖరీదు చేశారు. మరికొందరు తోబుట్టువుల కోసం డ్రెస్సులు, చీరలు ఖరీదు చేయడంలో దుకాణాల ముందు సందడిగా కనిపించారు.