పోలీస్ కార్యాలయంలో రాఖీ పండుగ వేడుకలు

– ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ  అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ( లా అండ్ ఆర్డర్ ) వెల్లడి
నవతెలంగాణ- కంటేశ్వర్
పోలీస్ కార్యాలయంలో రాఖి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆత్మీయ అనుబంధానికి ప్రతిగా రాఖీ పండగ అని అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ల్యాండ్ ఆర్డర్ జయరాం వెల్లడించారు. ఈ మేరకు గురువారం  పోలీస్ శాఖ లో జిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీస్ కార్యాలయం సిబంది ఆధ్వర్యంలో రాఖీ పొర్ణమి  నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాదు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ఎస్. జయ్ రామ్, పరిపాలన అధికారి శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంట్ లు శంకర్, గోవింద్, ఆఫీస్ సిబ్బంది లకు  రాఖీలు కట్టినారు. ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ప్రశాంత వాతావరణంలో ఇంటి వద్ద ఉండి రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ సబ్ డివిజన్ ఆర్మూర్ సబ్ డివిజన్స బ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సమాచారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు చేరవేసి వెనువెంట చర్యలు తీసుకోవాలన్నారు.