
పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాల యందు రాఖీ పౌర్ణమి పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ లతా పిల్లలకు రాకీలను కట్టిస్తూ రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యత తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల రెస్పాండ్ ఆయన ప్రకాష్ గుజరాతి మాట్లాడుతూ రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ల మధ్య తమ్ముళ్ల మధ్య అనురాగాన్ని ఆత్మీయతని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది అని పిల్లలకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో పిల్లలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.