
రాఖీ పండుగ అనగానే మనకు అక్క తమ్ముళ్లు అన్న చెల్లెలు గుర్తుకు వస్తారు. అన్న ఎంత దూరంలో ఉన్నా చెల్లెలు అన్న దగ్గరకు వెళ్లి రాఖీ రోజు చెయ్యి మనికట్టుకు రాఖీని కడతారు. అన్నచెల్లెళ్లతో పాటు అక్క తమ్ముళ్ల సోదర ప్రేమ తాజాగా రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు సైతం ఘనంగా రాఖీ పండుగను చేసుకుంటున్నారు. విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు మహిళలు ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టి విశాల హృదయాలను చాటుకుంటారు. ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ ప్రతి ఒక్కరిలో మొదలైంది. రక్షాబంధన్ లో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనడం విశేషం.