క్షత్రియ కళ్యాణ మండపంలో రక్ష బంధన్ వేడుకలు

నవతెలంగాణ  -ఆర్మూర్ 

రాఖీ పౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్త ఇందుర్ విభాగ్ సహకార్యవాహ శ్రీ వరంగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచానికి సోదర భావాన్ని పంచిన దేశం మన దేశం అని, సోదర భావానికి ప్రతీక ఈ రాఖీ రక్షాధారణ అని తెలియజేయడం జరిగింది.  సమాజంలో వ్యక్తులందరూ సోదర భావంతో ఉన్నట్లయితే ఎటువంటి గొడవలు కొట్లాటలు లేకుండా ఉంటామని, హిందూ ధర్మంలో ప్రతి పండగకు ఒక శాస్త్రీయత ప్రామాణికత ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నగర సంగచాలక్ శ్రీ పోల్కం నారాయణ  తిరునగరి దయాసాగర్, అల్జాపూర్ దేవేందర్, ఒడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.