అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్..

నవతెలంగాణ -రాయపోల్: అన్న చెల్లెల ఆత్మీయ అనుబంధానికి, రక్తసంబంధాలకు ప్రతీక రక్షా బంధన్.గురువారం రాయపోల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలందరూ ఉత్సహంగా రాఖీ వేడుకలు నిర్వించారు. రాఖీ పండుగ అనగానే  అన్న చెల్లెల, అక్క తమ్ముళ్ళ మధ్య ఆత్మీయ అనురాగాలు, రక్త సంబంధాలకు ప్రతీకగా నిర్వంచుకోవడం జరుగుతుంది.సమాజంలో జరిగే అఘాయిత్యాల నుండి మహిళలను రక్షించడానికి సోదరులు భరోసా కల్పిస్తారు. ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు, దుర్ఘటనలకు, చెడు వ్యసనలకు యువత అలవాటు పడుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా యువత వారి జీవితాలను అంధకారం చేసుకోకూడదని బాల్య దశ నుండే పిల్లలకు వినయం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన నేర్పించాలన్నారు. పిల్లల నడవడిక పై తల్లిదండ్రులు కూడా శ్రద్ద వహించాలి. ఒకరికొరు రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.