సోదర భావానికి ప్రతీకగా రక్షాబంధన్: కలెక్టర్

Rakshabandhan as a symbol of brotherhood: Collectorనవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసా ఇవ్వడమే రాఖీ పండుగ  విశిష్టత అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.సోమవారం జిల్లాలోని సంక్షేమ అధికారి కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న బాలసదనం  చిన్నారులు  కలక్టరెట్ లోని  కలక్టర్ చాంబర్ నందు కలెక్టర్ కు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాఖి  పండుగను పురస్కరించుకొని,అన్నా చెల్లెల్లు,అక్కా తమ్ముల ఆత్మీయ అనుబంధానికి రక్ష బంధన్ ప్రతీక గా నిలుస్తుందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను తమ సోదరీమణులుగా భావించి, అండగా ఉన్నప్పుడే అందరికి నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. సోదర, సోదరీమణులు ఒకరికొకరు అండగా, అప్యాయతలు నిండుగా చేసుకునే పండుగ రాఖీ పౌర్ణమి అన్నారు. తన సోదరుడు గొప్పగా ఉండాలని, తనకు  కొండంత అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ సోదరి కట్టే రక్ష ఈ రాఖీ పౌర్ణమి  కలెక్టర్ తెలిపారు.అనంతరం పిల్లలను ఆశీర్వదించి మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో  డి డబ్ల్యు ఓ నరసింహరావు, చేతన్య నాయుడు,పిల్లలు పూజ,అంజలి,ఆధిలక్షి, వర్షిత,నవనీత,సౌమ్య ఆశించిన,మధనశ్రి,రేఖ, డీసీపీయూ రవి కుమార్,చిల్డ్రన్ హోమ్ సుపేరేండెంట్ మంగతాయి,చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మీరా హబ్ కోఆర్డినేటర్ చైతన్య,సాగర్, కవిత,సఫియా, విద్యార్థినులు పాల్గొన్నారు.