జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ ..

Rally on the occasion of National Voter's Dayనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండల కేంద్రంలో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ప్రతిజ్ఞ నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని హైస్కూల్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులచే ప్రభుత్వ అధికారులచే ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేసినట్లు తాసిల్దార్ కిరణ్ మై తెలిపారు. విద్యార్థులచే అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం గా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ ,రెవిన్ ఇన్స్పెక్టర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.