అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ర్యాలీ

Rally on the occasion of International Anti Corruption Dayనవతెలంగాణ -పెద్దవూర 
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవ వారోత్సవాల సందర్బంగా సోమవారం మండల సామాజిక కార్యదర్శి తగరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించచారు. ఈసందర్బంగా మాట్లాడుతూ  అవినీతిని పారద్రోలాలని, అవినీతి రహిత  సమాజాన్ని నిర్మించాలని నినాదాలు చేశారు. స్వపరిపాలనలో సుపరిపాలన అందించుటలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు,అధికారులు, విద్యార్థులు పౌరులు పాల్గొన్నారు.