అల్ ఇండియా డిమాండ్స్ డే సంధర్భంగా సిఐటీయూ జిల్లా నాయకుకు సురేష్ గొండ ఆద్వర్యంలో ర్యాలీ , తహసీల్దార్ కు బుదువారంనాడు వినతిపత్రం అందించారు. ఈ సంధర్భంగా సిఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ మాట్లాడుతు డిమాండ్స్ డే సంధర్భంగా మండలంలోని అంగన్ వాడీ టీచర్స్ , ఆశాలు, స్కీం వర్కర్లు , జీపీ వర్కర్లు, అన్ని సంఘాల సబ్యులతో కలిసి జుక్కల్ మండల కేంద్రంలోని బసవేశ్వర చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ హిమబిందుకు అందించడం జర్గింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొొండ, జీపీ మండల వర్కర్స్ అద్యక్షుడు జాదవ్ వీరయ్య, అంగన్ వాడీ టీచర్లు లత, లక్ష్మీ , సుమలత, బుజ్జి , ఆశాలు, స్కీం వర్కర్లు, తదితరులు పాల్గోన్నారు.