వైద్య విద్యార్థి మృతికి నిరసనగా మనోరమ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్లో ని కలకత్తాలో వృత్తిలో ఉన్న ఓ మహిళా పీజీ విద్యార్థినిపై దారుణంగా కిరాతకులు అత్యాచారం చేసి,హత్యకు పాల్పడడం దారుణమని అన్నారు.ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కట్ట నరసింహ, డాక్టర్ హితేశ్, డాక్టర్ హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చివరివరకు ఎంతగానో ప్రయత్నిస్తారని, అలాంటి పవిత్రమైన వైద్యవృత్తి పైన కొందరు కామాంధులు లైంగిక దాడి జరిపి,హత్య చేయడం సిగు చేటని అన్నారు.అక్కడి ప్రభుత్వం హైకోర్టులో సిబిఐ విచారణ కు ఆదేశించినప్పటికీ సరైన దోషులను కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.ఆమె ఆత్మ శాంతికి మద్దతుగా మనోరమ ఆసుపత్రి వైద్య సిబ్బందితోపాటు,వివిధ విభాగాల వైద్యులు,మనోరమ ఆసుపత్రి నుండి ఎన్టీఆర్ చౌరస్తా,ఎల్లమ్మ గుట్ట చౌరస్తా మీదుగా ప్రగతి నగర్ గుండా ర్యాలీగా ఆసుపత్రి వరకు చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ వైద్యులు కట్ట నరసింహ,డాక్టర్ హరికృష్ణ, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.