చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ ర్యాలీ

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ మియాపూర్‌ డివిజన్‌లోని ఎస్‌ఆర్‌ ఎస్టేట్స్‌ నుంచి జీహెచ్‌ఎంసీ పార్కు వరకు కమ్మ సంఘం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో ‘మోత మొగిద్దాం’ అనే కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయు డి అక్రమ అరెస్ట్‌ని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, సత్య నారాయణ, గిరి, సాంబయ్య, కిల్లరి ప్రసాద్‌, చిట్టారెడ్డి ప్రసాద్‌,ప్రేమ్‌ చంద్‌, రాజేంద్ర ప్రసాద్‌, పరమేష్‌, ప్రశాంత్‌, నాని, హనుమయ్య చారీ, మూర్తి, ఉదరు, సాంబయ్య, కృష్ణమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.